నాయికలు పాటలకే పరిమితం కాకూడదు! | dasari narayana rao released nayaki teaser | Sakshi
Sakshi News home page

నాయికలు పాటలకే పరిమితం కాకూడదు!

Mar 18 2016 11:13 PM | Updated on Sep 3 2017 8:04 PM

నాయికలు పాటలకే పరిమితం కాకూడదు!

నాయికలు పాటలకే పరిమితం కాకూడదు!

‘‘ఈ చిత్రం టీజర్ చూస్తే సినిమా బాగుంటుందనిపిస్తోంది. గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రానికి మించిన విజయాన్ని ఈ చిత్రం సాధించాలి.

‘‘ఈ చిత్రం టీజర్ చూస్తే సినిమా బాగుంటుందనిపిస్తోంది. గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రానికి మించిన విజయాన్ని ఈ చిత్రం సాధించాలి. హీరోయిన్‌ను కేవలం పాటల కోసమే తీసుకుంటున్న ఈ రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న దర్శకుడు గోవికి నా అభినందనలు’’ అని డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. త్రిష, గణేశ్ వెంకట్రామన్ ప్రధానపాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడి పల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ‘నాయకి’ చిత్రం టీజర్‌ను దాసరి విడుదల చేశారు. ‘‘నాకిది ఫస్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్  మూవీ. ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడాను’’ అని త్రిష తెలిపారు. హీరో గణేశ్ వెంకట్రామన్, నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, లైన్ ప్రొడ్యూసర్ ఎం. వెంకటసాయి సంతోష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాంబాబు కుంపట్ట, కెమేరామ్యాన్ జగదీశ్ చీకటి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement