భారతీయుడు-2 చేయాలనుకుంటున్నాం! | Crazy Combination Rajini & Shankar : Bharateeyudu 2 | Sakshi
Sakshi News home page

భారతీయుడు-2 చేయాలనుకుంటున్నాం!

May 24 2015 11:30 PM | Updated on Aug 8 2019 11:13 AM

భారతీయుడు-2 చేయాలనుకుంటున్నాం! - Sakshi

భారతీయుడు-2 చేయాలనుకుంటున్నాం!

కమలహాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం నిర్మాత ఏఎమ్ రత్నాన్ని దేశమంతా తెలిసేలా చేసింది.

 కమలహాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం నిర్మాత ఏఎమ్ రత్నాన్ని దేశమంతా తెలిసేలా చేసింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఇటీవలే శంకర్, ఏఎమ్ రత్నం అనుకున్నారట. ఈ విశేషాలను రత్నం తెలియజేస్తూ - ‘‘శంకర్ నాకు అత్యంత సన్నిహితుడు. ఇటీవల మేమిద్దరం కలిసినపుడు ‘భారతీయుడు-2’ గురించి చర్చ వచ్చింది.
 
 ఎలా చేయాలో ఇద్దరం ఆలోచించుకున్నాం. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియమ్‌కి వెళ్లినప్పుడు కూడా మా ఇద్దరి మధ్య ఇదే చర్చ. కానీ అకస్మాత్తుగా శంకర్ ‘రోబో-2’ చేయాల్సి వస్తోంది. ‘రోబో-2’ తెలుగులో నేనే విడుదల చేస్తా, అలాగే ‘భారతీయుడు-2’ ఎప్పటికైనా నిర్మిస్తా’’ అన్నారు. తమిళంలో అజిత్‌తో చేసిన ‘ఎన్నై ఎరిందాల్’ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో ఇటీవలే రత్నం విడుదల చేశారు. ఈ సినిమా ఘనవిజయంతో సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి ఊతం దొరికిందని రత్నం సంతోషం వెలిబుచ్చారు. చిరంజీవి తదితర అగ్రహీరోలంతా తాను మంచి కథతో వెళితే డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రత్నం అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement