ఇప్పటికి నిజమైంది! | Confirmed Venkatesh and Pavan Kalyan to act in a multi starer movie | Sakshi
Sakshi News home page

ఇప్పటికి నిజమైంది!

Feb 12 2014 11:20 PM | Updated on Jul 6 2019 3:48 PM

ఇప్పటికి నిజమైంది! - Sakshi

ఇప్పటికి నిజమైంది!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, పాండవులు పాండవులు తుమ్మెద... ఇలా వరుసగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, పాండవులు పాండవులు తుమ్మెద... ఇలా వరుసగా మల్టీస్టారర్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. వాటిలో వెంకటేష్, పవన్‌కల్యాణ్ చిత్రం ఒకటి. ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషనే. వెంకీకి ఇది తొలి మల్టీస్టారర్ కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌కి మాత్రం ఇదే తొలి సినిమా. పైగా ఎప్పట్నుంచో ఈ ఇద్దరూ కలిసి నటించాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెంకటేషే స్వయంగా చెప్పారు.
 
  మంచి కథ కుదిరితే చేయడానికి అభ్యంతరం లేదని పవన్ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రెండేళ్లల్లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే వార్తలు చాలాసార్లు వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. ఈసారి నిజమైంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత శరత్ మరార్ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇంగ్లిష్ మూవీ ‘మేన్ హు స్యూడ్’, హిందీ చిత్రం ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలతో ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం ఆనందంగా ఉందని శరత్ తెలియజేయగా, పూర్తి వివరాలను త్వరలో చెబుతామని సురేష్‌బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement