వివాదంలో ‘సత్యమేవ జయతే’

Complaint Filed Against Bollywood Film Satyameva Jayate - Sakshi

బాలీవుడ్ నటులు జాన్‌ అబ్రహం, మనోజ్‌ బాజ్‌పాయ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ సత్యమేవ జయతే. మిలాప్‌ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక టీ సిరీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ వివాదాస్పదమయ్యింది. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయంటు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

పవిత్ర మొహరం సంతాప దినాల్లో హీరో (జాన్‌ అబ్రహం) ఓ వ్యక్తిని హత్య చేసినట్టుగా ట్రైలర్‌లో చూపించారు. ఈ సీన్స్‌ తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ హైదరాబాద్‌, పాతబస్తీ డబీర్‌ పురాకు చెందిన అడ్వకేట్‌ జాఫర్‌ నదీం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమాటోగ్రఫి యాక్ట్ 5బి ప్రకారం సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని.. చిత్ర దర్శక, నిర్మాతలతో పాటు ఆ సన్నివేశంలో నటించిన జాన్‌ అబ్రహంపై చర్యలు తీసుకోవాలని జాఫర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top