హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి | Comedian, showman and telethon host Jerry Lewis dies at 91 | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

Aug 21 2017 10:11 AM | Updated on Sep 17 2017 5:48 PM

హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

అమెరికన్‌ నటుడు, ప్రఖ్యాత కమెడియన్‌ జెర్రీ లూయిస్‌ మరణించారు.

అమెరికన్‌ నటుడు, ప్రఖ్యాత హాలీవుడ్‌ కమెడియన్‌ జెర్రీ లూయిస్‌ మరణించారు.  దీర్ఘకాలముగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ 91 ఏళ్ల హాస్యనటుడు తన నివాసమైన లాస్‌వెగాస్‌లో ఆదివారం ఉదయం 9.15 గంటలకు తుది శ్వాస విడిచారు. ‘ది బెల్‌ బాయ్‌’, ‘జెర్రీ లూయిస్’‌, సిండెర్‌ఫెల్లా, ‘ది నాటీ ఫ్రోఫెసర్‌’  పాత్రలతో జెర్రీ లూయిస్‌ స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపుపొందారు. 1950లో ద బ్రాష్‌ ప్లాస్టిక్‌ కామిక్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. యూరప్‌లోని ఐదు దేశాల నుంచి 8 సార్లు ఉత్తమ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. 
 
జెర్రీ తన 18వ ఏట సింగర్‌ పట్టి పాల్మర్‌ను కలుసుకున్న పదిరోజులకే పెళ్లాడాడు. 1944-82 మధ్య సాగిన వీరి దాంపత్యానికి ఐదుగురు సంతానం కాగా మరోకరిని దత్తత తీసుకున్నారు. జెర్రీ చిన్న కుమారుడు 2009లో డ్రగ్స్‌కు అడిక్ట్‌ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అనారోగ్యంతో జెర్రీకి1983లోనే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరగగా 1992లో ప్రొస్టెట్‌ కెన్సర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. జెర్రీ 2003 నుంచి పూర్తిగా మందులపై ఆధారపడే జీవించారు. 2006లో ఒక సారి గుండెపోటు రాగా మరణించే వరకు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

Advertisement

పోల్

Advertisement