తమిళ్‌ అర్జున్‌రెడ్డి విక్రమ్‌ వారసుడు

Chiyaan Vikram's son Dhruv to debut with Arjun Reddy Tamil remake

రెడీ... ‘అర్జున్‌రెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘చియాన్‌’ విక్రమ్‌ వారసుడు ధృవ్‌ విక్రమ్‌ రెడీ. అది తమిళ ప్రేక్షకుల ముందుకు మాత్రమే! తెలుగులోకి ఎప్పుడు తీసుకొస్తారో మరి? విజయ్‌సాయి దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌తో ధృవ్‌ హీరోగా పరిచయం కానున్నట్టు స్వయంగా విక్రమ్‌ వెల్లడించారు.

‘రెడీ టు మేక్‌ ద లీప్‌. ధృవ్‌ టు బి అర్జున్‌రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్‌ పోస్ట్‌ చేశారు. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకూ విక్రమ్‌ సుపరిచితుడే. ఎప్పట్నుంచో ధృవ్‌ విక్రమ్‌ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. డిఫరెంట్‌ ఫిల్మ్స్‌లో నటించే విక్రమ్‌... తనయుడి ఎంట్రీకీ డిఫరెంట్‌ కథనే ఎంచుకోవడం విశేషం!!

Back to Top