పూజ పూర్తి.. షూటింగ్‌కి రెడీ | Chiyaan Vikram's 300 Cr 'Mahavir Karna' in Sabarimala | Sakshi
Sakshi News home page

పూజ పూర్తి.. షూటింగ్‌కి రెడీ

Apr 13 2018 1:06 AM | Updated on Apr 13 2018 1:06 AM

Chiyaan Vikram's 300 Cr 'Mahavir Karna' in Sabarimala - Sakshi

శబరిమలలో దర్శకుడు విమల్‌... విక్రమ్‌

దైవం ఆశీస్సులుంటే ఏ అడ్డంకులు రాకుండా తమ సినిమా షూటింగ్‌ సవ్యంగా సాగుతుందని చాలామంది నమ్ముతారు అందుకే సినిమా స్టార్టింగ్‌ టైమ్‌లో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే పూజలు చేశారు మలయాళ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌. విమల్‌. విక్రమ్‌ హీరోగా విమల్‌ దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా రూపొందనున్న సినిమా ‘మహావీర్‌ కర్ణ’. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌కు శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు చేయించారు దర్శకుడు విమల్‌.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయిన ఆర్టిస్టులను తీసుకోనున్నారు. హాలీవుడ్‌ లెవల్‌ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలోని స్క్రిప్ట్‌ను గత ఏడాదిన్నర టైమ్‌లో ఎయిట్‌ టైమ్స్‌ రీ–రైట్‌ చేశారట విమల్‌. అంటే స్క్రిప్ట్‌ పరంగా ఆయన ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తున్నారో ఊహించుకోవచ్చు. కథ మీద దర్శకుడు ఈ రేంజ్‌లో కసరత్తులు చేస్తుంటే మరోవైపు హీరో విక్రమ్‌ ఫిజిక్‌ మీద దృష్టి పెట్టారట. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు భారీగా ఉంటాయి. వాటి కోసం హాలీవుడ్‌ నుంచి స్టంట్‌ డైరెక్టర్స్‌ని పిలిపించనున్నారని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement