సమంత మెచ్చుకున్నారు | Chiru Tej Singh Movie Press Meet | Sakshi
Sakshi News home page

సమంత మెచ్చుకున్నారు

Mar 20 2018 12:25 AM | Updated on Mar 20 2018 12:25 AM

Chiru Tej Singh Movie Press Meet - Sakshi

మనాలి రాథోడ్, సౌమ్య వేణుగోపాల్, చిరుతేజ్‌ సింగ్‌ ముఖ్య తారలుగా ఆనంద్‌కుమార్‌ దర్శకత్వంలో ఎన్‌.ఎస్‌. నాయక్‌ నిర్మించిన బాలల చిత్రం ‘చిరుతేజ్‌ సింగ్‌’. బాలమేధావి చిరుతేజ్‌ సింగ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘‘కేవలం మూడు నిమిషాల్లో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాలమేధావి చిరుతేజ్‌ సింగ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

అనాథ పిల్లలకోసం ఓ ప్రముఖ స్టూడియోలో ప్రివ్యూ వేసినప్పుడు ప్రముఖ హీరోయిన్‌ సమంత ఈ సినిమాను చూసి అభినందించారు. దర్శకుడు వీరశంకర్, నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకులు ‘మధుర’ శ్రీధర్‌లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజశేఖర్, ఎన్‌.ఎస్‌. నాయక్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గీతా పూనిక్‌.
∙మనాలి రాథోడ్, ఆనంద్, చిరుతేజ్‌

Advertisement
 
Advertisement
Advertisement