మెగాస్టార్ 151 ప్రీ లుక్ ఇదేనా..? | Chiranjeevi uyyalawada narasimha reddy Pre look | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ 151 ప్రీ లుక్ ఇదేనా..?

Mar 18 2017 10:18 AM | Updated on Sep 5 2017 6:26 AM

మెగాస్టార్ 151 ప్రీ లుక్ ఇదేనా..?

మెగాస్టార్ 151 ప్రీ లుక్ ఇదేనా..?

తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తరువాత కూడా తన కలెక్షన్

తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తరువాత కూడా తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. రీ ఎంట్రీలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సత్తా చాటిన మెగాస్టార్.. 151వ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. చాలా రోజులుగా చర్చల్లో ఉన్న చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఖైదీ నంబర్ 150 సక్సెస్ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా రోజులు ఆలోచన చేసిన చిరు.. ఫైనల్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికే ఫిక్స్ అయ్యారట. ఇటీవలే దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన ఫైనల్ వర్షన్ కథ విన్న మోగాస్టార్ చిరంజీవి ప్రీ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోగా మెగాస్టార్ కొత్త సినిమా పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్చల్ చేస్తోంది. యుఎన్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే టైటిల్ లోగోపాటు ఆంగ్లేయులతో కొంతమంది వీరులు పోరాడుతున్న దృశ్యం, గొడ్డలితో పవర్ ఫుల్గా ఉంది, ఈ ప్రీ లుక్. అయితే ఈ పోస్టర్ను అఫీషియల్ యూనిట్ సభ్యులు రిలీజ్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement