ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌ | Chiranjeevi Message To Prabhas After Seeing Saaho Trailer | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

Aug 11 2019 6:11 PM | Updated on Aug 11 2019 8:19 PM

Chiranjeevi Message To Prabhas After Seeing Saaho Trailer - Sakshi

పాన్‌ ఇండియా సినిమాగా సాహో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో అందరి దృష్టి సాహోపై నెలకొంది. టీజర్‌, సాంగ్స్‌తో భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన చిత్రయూనిట్‌.. నిన్న ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి అంచనాలను పెంచేసింది. సోషల్‌ మీడియాలో సాహో ట్రైలర్‌ హల్‌ చల్‌ చేస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ట్రైలర్‌పై స్పందించారు.

ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన సందర్భంగా.. నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ట్రైలర్‌చూసి మెగాస్టార్‌ చిరంజీవి మెసెజ్‌ చేశాడని, ట్రైలర్‌ బాగుందని ఆయన అన్నారని ఓ ప్రశ్నకు  ప్రభాస్‌  సమాధానమిచ్చాడు. తనకు హైదరాబాద్‌ రెండో ఇళ్లుగా మారిందని, గత రెండేళ్లుగా ఇక్కడి వస్తూ ఉన్నానని శ్రద్దా కపూర్‌ తెలిపారు. ఇప్పటి నుంచి సినిమా రిలీజయ్యే వరకు ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారని ప్రభాస్‌ పేర్కొన్నాడు. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement