నీకొచ్చింది జ్వరం.. క్యాన్సర్‌ కాదు | ChiLaSow Telugu Movie Teaser Out | Sakshi
Sakshi News home page

May 7 2018 6:31 PM | Updated on May 7 2018 6:31 PM

ChiLaSow Telugu Movie Teaser Out - Sakshi

చి.ల.సౌ. టీజర్‌లో ఓ దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా సినిమాలు చేస్తున్నా అక్కినేని యంగ్ హీరో సుశాంత్‌కు సక్సెస్‌ రేటు మాత్రం అంతగా లేదు. ఈ తరుణంగా అందాల రాక్షసి హీరో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారి తీసిన చిత్రంలో సుశాంత్‌ హీరోగా నటించాడు. అదే చి.ల.సౌ.   ఈ చిత్ర టీజర్‌ను దగ్గుబాటి రానా కాసేపటిక్రితం విడుదల చేశాడు.

సల్మాన్‌ ఖాన్‌ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడైన ఓ యువకుడు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ, అతని తల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలంటూ అతన్ని ఒత్తిడి చేస్తుంటుంది. ఆంజనేయుడి ముందు కొడుకు మనసు మార్చాలని తల్లి వేడుకోవటం, నీకొచ్చింది జ్వరం.. కాన్సర్‌ కాదని హీరో తన తల్లితో చెప్పే డైలాగులు. మొత్తానికి ఎంటర్‌టైనింగ్‌గా ఫస్ట్‌ టీజర్‌ను కట్‌ చేశారు. సుశాంత్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో వెన్నెల కిషోర్‌ నవ్వులు పంచినట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంతో రుహని శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. భరత్‌ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్‌ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. మేకర్లు త్వరలోనే ‘చి.ల.సౌ.’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement