'ఆర్మ్పిట్ వివాదం'పై నటి ఆగ్రహం | Check out Priyanka Chopra's response to 'armpit' controversy | Sakshi
Sakshi News home page

'ఆర్మ్పిట్ వివాదం'పై నటి ఆగ్రహం

Jun 22 2016 8:29 PM | Updated on Sep 4 2017 3:08 AM

'ఆర్మ్పిట్ వివాదం'పై నటి ఆగ్రహం

'ఆర్మ్పిట్ వివాదం'పై నటి ఆగ్రహం

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆర్మ్ పిట్ వివాదంపై నటి ప్రియాంకా చోప్రా తనదైన శైలిలో స్పందించారు.

ముంబై: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆర్మ్ పిట్ వివాదంపై నటి ప్రియాంకా చోప్రా తనదైన శైలిలో స్పందించారు. వివాదానికి కారణమైన అసలు ఫొటోకుతోడు మరో ఫొటోను జతచేస్తూ 'రంధ్రాణ్వేషణకు మరో ఫోటోను జతచేస్తున్నా' అని కామెంట్ తో కోపాన్ని వెలిబుచ్చారు. చాలా అరుదుగా ఆగ్రహానికి గురయ్యే ప్రియాంక.. ఇంతగా విసుగుచెందడానికి బలమైన కారణం ఉంది..

'క్వాంటికో' షోతో పశ్చిమదేశాల్లో సైతం ప్రియాంక పాపులారిటీ ఆసాంతం పెరిగింది. దీంతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన 'మాక్సిమ్' మెన్స్ మాగజైన్.. జూన్/జులై సంచిక కవర్ పేజీపై ప్రియాంక చోప్రా హాట్ ఫొటో ఒకటి ప్రచురించింది. అయితే ఆ ఫొటోలో ఆమె బాహుమూలలు(ఆర్మ్ పిట్) నున్నగా కనిపించాయి. అంతే 'ప్రియాంక ఆర్మ్ పిట్ ను ఫొటోషాప్ లో చేశారంటూ' హ్యాష్ ట్యాగ్ లు జోడించిమరీ కొందరు నెటిజన్లు చర్చించుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రియాంకను నిందించారు. నెటిజన్ల కామెంట్లతో విసిగెత్తిన ఆమె చేతులు పైకి లేపి బాహుమూలలను ప్రదర్శిస్తూ మరో ఫొటోను పోస్ట్ చేసి ఇందులోనూ తప్పులు వెతుక్కోండి(రంధ్రాణ్వేషణ చేసుకోండి) అని కామెంట్ పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement