పొగిడితే కానీ పనిచేయదు! | Charmme Kaur Birthday: Jyothi Lakshmi Producer C Kalyan Gifts her Lion-Shaped Diamond Ring | Sakshi
Sakshi News home page

పొగిడితే కానీ పనిచేయదు!

May 18 2015 12:03 AM | Updated on Sep 3 2017 2:14 AM

పొగిడితే కానీ పనిచేయదు!

పొగిడితే కానీ పనిచేయదు!

హీరోయిన్ చార్మికి నిన్న ఆదివారం నాటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ,

హీరోయిన్ చార్మికి నిన్న ఆదివారం నాటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, నెల్లూరు నుంచి బెంగు ళూరు, ఢిల్లీ దాకా ఆమె అభిమానులు చాలామంది స్వయంగా వచ్చి, చార్మి ఎదురుగానే ఆమె తమకెందుకో ఇష్టమో కవితలు, పాటలు, మాటల రూపంలో చెప్పి మరీ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. చార్మి కథానాయికగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే ‘చార్మ్ మి’ పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ‘‘నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే’’ అని వ్యాఖ్యానించారు.
 
  ‘‘నిర్మాత సి. కల్యాణ్ నాకు ‘జ్యోతిలక్ష్మీ’ సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం’’ అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు. సినిమా గురించి ఆయన చెబుతూ, ‘‘రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో’’ అని వ్యాఖ్యానించారు.
 
 నటుడు సంపూర్ణేశ్‌బాబు, రచయిత భాస్కరభట్ల, కెమేరామన్ పి.జి. విందా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. అన్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు. సినిమాలో ‘హీరోయిజమ్ కాదు... హీరోయినిజమ్ చూస్తారు’
 అన్న మాటలకు అర్థం అదేనా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement