సంబరాలు... సరదాలు... ఓ సమస్య | Chandiviran as kali in telugu | Sakshi
Sakshi News home page

సంబరాలు... సరదాలు... ఓ సమస్య

Jan 4 2017 11:53 PM | Updated on Sep 5 2017 12:24 AM

సంబరాలు... సరదాలు... ఓ సమస్య

సంబరాలు... సరదాలు... ఓ సమస్య

నిజ జీవిత కథలను వైవిధ్యంగా తెరకెక్కించగల ప్రతిభాశాలి తమిళ దర్శకుడు బాల.


నిజ జీవిత కథలను వైవిధ్యంగా తెరకెక్కించగల ప్రతిభాశాలి తమిళ దర్శకుడు బాల. ఆయన నిర్మించిన ‘చండివీరన్‌’ తెలుగులో ‘కాళి’ పేరుతో విడుదల కానుంది. అధర్వ, ఆనంది, లాల్‌ ముఖ్య పాత్రల్లో శర్కునమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎం.ఆర్‌ తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘హృదయం’ అనే తెలుగు సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు మురళి. ఆయన తనయుడు అధర్వ ‘కాళి’లో హీరోగా నటించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు.

‘‘నీటి కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోరాటమే ఈ చిత్రకథ. సంక్రాంతి సంబరాలు, పల్లెటూరి సరసాలు, సరదాలన్నీ ఉన్నాయి. ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘ఈ చిత్రంలో ‘ఎసేయ్‌ మావా...’ అనే పాట రాశా’’ అని డా. చల్లా భాగ్యలక్ష్మి అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పి.జి.ముత్తయ్య, సంగీతం: ఎస్‌.ఎన్ .అరుణ గిరి, సమర్పణ: బాల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రఘు.

Advertisement
 
Advertisement
Advertisement