వీరనారి ఐలమ్మ కథ | 'Chakali Ailamma' movie Release on 6th december | Sakshi
Sakshi News home page

వీరనారి ఐలమ్మ కథ

Dec 4 2013 12:57 AM | Updated on Sep 2 2017 1:13 AM

వీరనారి ఐలమ్మ కథ

వీరనారి ఐలమ్మ కథ

ప్రీతినిగమ్ టైటిల్ రోల్‌లో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరనారి చాకలి ఐలమ్మ’. బోళ్ళ సోమిరెడ్డి సమర్పణలో

 ప్రీతినిగమ్ టైటిల్ రోల్‌లో మిరియాల రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరనారి చాకలి ఐలమ్మ’. బోళ్ళ సోమిరెడ్డి సమర్పణలో  రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీజ ఫిలింస్ అధినేత శ్రీ వెంకట్రావు 300 థియేటర్స్‌లో ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతకోట వేణుగోపాలరావు మాట్లాడుతూ - ‘‘నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరులో భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరు సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ కథతో ఈ సినిమా చేశాం. నేటి సమాజం హర్షించే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యాక్షన్, సెంటిమెంట్, లవ్, కామెడీ సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: వాసంశెట్టి వెంకటేశ్వరరావు, బోళ్ళ విక్రమాదిత్యారెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement