
టెంపర్ రీమేక్‌గా తెరకెక్కిన ‘సింబా’తో ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు రణ్‌వీర్ సింగ్. ఈ మూవీ బాలీవుడ్‌లో 250కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తాజాగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘గల్లీబాయ్’ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం నుంచి విడుదలైన ‘అప్నా టైమ్ ఆయేగా’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీలో ఓ రొమాంటిక్ సీన్ కట్ చేశారట. దాదాపు 13సెకన్ల పాటు ఉన్న ముద్దు సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం. అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జోయా అక్తర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.