అన్నీ బుల్లెట్‌లే! | Bullet Rani Movie Audio Released | Sakshi
Sakshi News home page

అన్నీ బుల్లెట్‌లే!

Jul 17 2015 12:05 AM | Updated on Sep 3 2017 5:37 AM

అన్నీ బుల్లెట్‌లే!

అన్నీ బుల్లెట్‌లే!

శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నిషా కొఠారి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెలుగు,

శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నిషా కొఠారి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గున్వంత్ సేన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల విడుదల సందర్భంగా నిషా కొఠారి మాట్లాడుతూ - ‘‘ఇందులోని ప్రతి పాటా బుల్లెట్‌లా ఉంటుంది. మంచి డ్యాన్సులు చేయడానికి స్కోప్ ఉన్న పాటలివి. ఇప్పటివరకు నేను ఎన్నో పాటలకు నర్తించినా ఈ సినిమాకి చేసిన డ్యాన్సులు ప్రత్యేకంగా ఉంటాయి’’ అన్నారు. కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఈ యాక్షన్ మూవీలో బుల్లెట్ రాణిగా నిషా అద్భుతంగా నటించారని, ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రం అవుతుందని దర్శకుడు తెలిపారు. పాటలు వీనుల విందుగా మాత్రమే కాదు.. కనువిందుగా కూడా ఉంటాయని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement