రావణ లంకలో... | Nisha Kotari Movie O Ravana Lanka | Sakshi
Sakshi News home page

రావణ లంకలో...

Nov 25 2017 12:34 AM | Updated on Nov 25 2017 12:34 AM

Nisha Kotari Movie O Ravana Lanka - Sakshi

హాట్‌ గర్ల్‌ నిషా కొఠారి గుర్తుండే ఉంటుంది. రామ్‌గోపాల్‌ వర్మ ‘ఆగ్‌’ సినిమాలో హాట్‌ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆమె  కథానాయికగా సంపత్‌ రాజ్‌ దర్శకత్వంలో మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ నిర్మించిన చిత్రం ‘ఓ రావణ లంక’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సంపత్‌ రాజ్‌ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్‌ యాక్షన్‌ చిత్రమిది. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్‌ ఫైట్‌ హైలైట్‌. నిషా కొఠారి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు. ‘‘సంపత్‌ చెప్పిన కథ నచ్చింది. మంచి సంగీతం కుదిరింది. చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు దివాకర్‌. ఈ చిత్రానికి సంగీతం: శిఘు, కెమెరా: వల్లి.

Advertisement
 
Advertisement
Advertisement