విద్యార్థులకు స్ఫూర్తిగా... | Brahmanandam's New Avatar In Aditya | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్ఫూర్తిగా...

Nov 16 2014 10:53 PM | Updated on Sep 2 2017 4:35 PM

పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే ఏదైనా సాధించగలుగుతారనేది ప్రధానాంశంగా చేసుకుని స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’.

 పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే ఏదైనా సాధించగలుగుతారనేది ప్రధానాంశంగా చేసుకుని స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఆదిత్య’. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సీడీని విడుదల చేసి, హైకోర్ట్ న్యాయమూర్తి బి.చంద్రకుమార్‌కి ఇచ్చారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే చిత్రం రూపొందించిన సుధాకర్ గౌడ్‌ని అభినందిస్తున్నానని టి.రాజయ్య అన్నారు. బాలల చిత్రంలో నటించలేదనే కొరత ఈ చిత్రంతో తీరిందని సుమన్ అన్నారు. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ - ‘‘ఇందులో నేనో కీలక పాత్ర చేశాను. విద్యార్థుల్లో సృజనాతక్మ శక్తి పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ఇతివృత్తం. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement