శాస్త్రవేత్తగా...! | Brahmanandam's New Avatar In Aditya | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తగా...!

Sep 16 2014 12:28 AM | Updated on Sep 2 2017 1:25 PM

శాస్త్రవేత్తగా...!

శాస్త్రవేత్తగా...!

ఇప్పటివరకు వెండితెరపై పలు రకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు ‘ఆదిత్య’ చిత్రంలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో స్వీయదర్శకత్వంలో

 ఇప్పటివరకు వెండితెరపై పలు రకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు ‘ఆదిత్య’ చిత్రంలో శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో స్వీయదర్శకత్వంలో భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్  హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ -‘‘బాల్య దశలోనే విద్యార్థులు సృజనాతక్మ శక్తిని పెంపొందిస్తే వాళ్లు మంచి పౌరులుగా ఎదుగుతారనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. ఇందులో బ్రహ్మానందం శాస్త్రవేత్త పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. అభ్యుదయవాదిగా సుమన్, స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఎమ్మెస్ నారాయణ చేస్తున్నారు. ఇది చక్కని విద్యా వైజ్ఞానిక చిత్రం అవుతుంది. ఈ నెలాఖరున పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కందేటి శంకర్, ఎడిటింగ్: నందమూరి హరి.
 

Advertisement
 
Advertisement
Advertisement