ఎవరికీ తెలియని విషయాలతో...

Boney Kapoor to make a documentary on the late Sridevi? - Sakshi

శ్రీదేవి నాలుగేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చింది. 13 ఏళ్ల వయసులో హీరోయిన్‌ అయింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ టు హీరోయిన్‌.. ఆమె కెరీర్‌ 50 ఏళ్లు. ‘ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌’. హిందీ నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఎవరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి అరుదైన విషయాలతో బోనీ కపూర్‌ ఓ డాక్యుమెంటరీ తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

భార్య హఠాన్మరణాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆమె మరణం గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం ఆయన్ను మరింత బాధపెడుతోందని సన్నిహితులు అంటున్నారు. భార్య గురించి ఎవరికీ తెలియని విశేషాలతో ఆయన తీయనున్న డాక్యుమెంటరీలో శ్రీదేవి జీవితంలోని కీలక వ్యక్తులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని సమాచారమ్‌. జగదేక సుందరి కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటైన ‘మిస్టర్‌ ఇండియా’ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించనున్నారట. కచ్చితంగా ఈ చిత్రం కోసం శ్రీదేవి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. బోనీ నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top