బాలీవుడ్‌లో మరో విషాదం | Bollywood Veteran Actress Shammi Aunty Passes Away | Sakshi
Sakshi News home page

Mar 6 2018 11:29 AM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood Veteran Actress Shammi Aunty Passes Away - Sakshi

బాలీవుడ్ నటి శ్రీదేవి మరణం మరిచిపోక ముందే మరో బాలీవుడ్ సీనియర్‌ నటి కన్నుమూసింది. 6 దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి షమ్మి రబడి(89) అనారోగ్యంతో కన్నుమూశారు. ముంబై జుహూ సర్కిల్‌లోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ లో తల్లి పాత్రలకు, బామ్మ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. 

షమ్మి ఆంటీగా పాపులర్‌ అయిన ఆమె మరణం పట్ల బాలీవుడ్ తారలు సంతాపం తెలియజేశారు. 200లకు పైగా చిత్రాల్లో నటించిన షమ్మి అసలు పేరు నర్గీస్‌. ఎక్కువగా హాస్య ప్రధాన పాత్రల్లో నటించిన షమ్మి.. కూలీ నెం 1, గోపి కిషన్‌, హమ్‌ సాథ్ సాథ్‌ హై లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. జబాన్ సంభాల్‌కే, శ్రీమాన్‌ శ్రీమతి, కభీ ఏ కభీ ఓ లాంటి పాపులర్ సీరియల్స్‌లోనూ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement