చీట్‌ మీల్స్‌ కోసం యంగ్ హీరో

Bollywood Hero Tiger Shroff Running Video - Sakshi

స్టూడెంట్ ఆఫ్‌ ద ఇయర్ సినిమాకు సీక్వల్‌గా ‘స్టూడెంట్ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌లో మ్యాన్లీ హంక్‌ టైగర్‌ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు. పునీత్‌ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరిలో జరగుతోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. టైగర్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తున్న తారా సుతారియా, అనన‍్య పాండేలు షూటింగ్ సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.

తాజాగా హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా ఓ ఆసక్తికర వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. మరో నలుగురితో కలిసి రన్నింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసిన టైగర్‌ ‘నా చీట్‌ మీల్స్‌(డైట్‌ ప్లాన్‌లో లేని జంక్‌ ఫుడ్‌) కోసం ఇలా పరిగెడుతున్నాను’ అంటూ కామెంట్‌ చేశారు. హిరో యష్‌ జోహర్‌, అపూర్వ మెహతాలో కలిసి కరణ్ జోహర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top