నకుల్‌తో బాలీవుడ్ బ్యూటీ అంచల్ | Bollywood beauty Anchal Nakul | Sakshi
Sakshi News home page

నకుల్‌తో బాలీవుడ్ బ్యూటీ అంచల్

Mar 21 2016 4:05 AM | Updated on Apr 3 2019 6:23 PM

నకుల్‌తో బాలీవుడ్ బ్యూటీ అంచల్ - Sakshi

నకుల్‌తో బాలీవుడ్ బ్యూటీ అంచల్

నటుడు నకుల్ బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వల్లినం వంటి విజయవంతమైన చిత్రం తరువాత నకుల్ ఒక భారీ ....

నటుడు నకుల్ బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వల్లినం వంటి విజయవంతమైన చిత్రం తరువాత నకుల్ ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.ఇటీవలే ఓ ఇంటి వాడైన ఈయన కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో బాలీవుడ్ భామ ఆంచల్ కథానాయికిగా పరిచయం కానున్నారు. ఈమె హిందీలో కరణ్ జోహర్ నిర్మించిన వీఆర్ ఫ్యామిలీ చిత్రం ద్వారా నటిగా పరిచయమైందన్నది గమనార్హం. ఆ తరువాత ప్రకాశ్ జా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్‌తో కలసి అరక్షన్ చిత్రంలో ఇటీవల సన్నిడియోల్‌తో కలిసి ఘాయల్ ఒన్స్ ఎగైన్ చిత్రంలోనూ నటించి ప్రాచుర్యం పొందిన ఆంచల్ ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. దీన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థలు బియాండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్,ట్రిప్పీ టర్టిల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ప్రముఖ మలయాళ దర్శకుడు గోపాలన్ మనోజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన జాతీయ అవార్డులతో పాటు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా అవార్డులను అందుకున్నారు. గోపాలన్ మనోజ్ దర్శకత్వం వహించిన వయలిన్ టెలీఫిలిం కేరళ ప్రభుత్వం నుంచి నాలుగు అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా లారా టెలీఫిలిం, అతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకుంది. దర్శకుడి తొలి చిత్రం సారధి ప్రేక్షకాదరణతో పాటు వివర్శకుల ప్రశంసలు పొందింది. నకుల్, అంచల్ హీరోహీరోయిన్లుగా నటించనున్న చిత్రం ఈ నెల 26న చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి కథ, కథనం,మాటలను రాజేశ్ కే.రామన్, సతీష్ గురూబ్ చాయాగ్రహణం, నితిన్ లోబస్ సంగీతాన్ని, జిగర్‌తండ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతల్ని అందించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement