ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ | Bigg Boss 3 Telugu Ramya Krishna As Host In Sixth Week | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

Aug 31 2019 11:04 PM | Updated on Sep 1 2019 10:13 AM

Bigg Boss 3 Telugu Ramya Krishna As Host In Sixth Week - Sakshi

పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కోసం విదేశాలకు వెళ్లిన నాగ్‌.. వీకెండ్‌ ఎపిసోడ్‌కు దూరంగా ఉండిపోయాడు. దీంతో రమ్యకృష్ణ ఆ బాధ్యతను చేపట్టింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పంపిస్తూ..  బిగ్‌బాస్‌ ప్రేక్షకులను నాగ్‌ పలకరించాడు. వచ్చే వారం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు. ఇక రమ్యకృష్ణ తన టైమింగ్‌తో షోను నడిపించింది.
 
ఒక్కసారిగా రమ్యకృష్ణను చూసిన హౌస్‌మేట్స్‌ ఆశ్చర్యానికి గురయ్యారు.  వీడియో సందేశం ద్వారా నాగ్‌.. హౌస్‌మేట్స్‌తో ముచ్చటించాడు. ఈ ఒక్క వారం తమ ఇంటి సభ్యులను చూసుకోమని రమ్యకృష్ణకు సూచించాడు. రమ్యకృష్ణతో జాగ్రత్తగా ఉండమని హౌస్‌మేట్స్‌ను హెచ్చరించాడు. అనంతరం షోను ప్రారంభించిన రమ్యకృష్ణ ఇంటి సభ్యులతో ఓ ఆటను ఆడించింది.

తాను క్లాప్స్‌ కొట్టిన ప్రతీసారి మంచి, చెడు అంటూ ఓ హౌస్‌మేట్స్‌ గురించి మార్చుకుంటూ చెప్పాలని తెలిపింది. దీనిలో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్‌, పునర్నవిలను పిలిచింది. వంట బాగా చేస్తాడని, ఎప్పుడూ కిచెన్‌లోనే ఉంటాడని బాబా గురించి పునర్నవి చెప్పుకొచ్చింది. ఇక బాబా కూడా పునర్నవి గురించి చెబుతూ ఉండగా.. వెంటవెంటనే క్లాప్స్‌ కొడుతూ బాబాను తికమకపెట్టింది. దీంతో ఏం చెప్పాలో బాబాకు దిక్కుతోచలేదు. మహేష్‌-వితికా, అలీ-శ్రీముఖి, రవి-హిమజ, శివజ్యోతి-రాహుల్‌లను పిలిచి ఇదే మాదిరిగా ఆటపట్టించింది. ఇక వారందర్నీ హౌస్‌లో తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పమని ఇంటి సభ్యులను కోరింది.

అయితే సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా అందరూ వితికాను టార్గెట్‌ చేయడంపై.. రవి, రాహుల్‌, వరుణ్‌లను నిలదీసింది. ఎందుకు అమ్మాయిలనే టార్గెట్‌ చేశారని, మగవారిని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించింది. అలా అమ్మాయిలను టార్గెట్‌ చేసినందుకు గానూ.. వరుణ్‌ మొహంపై వితికా చేత కోల్డ్‌ కాఫీ పోయించింది. రాహుల్‌కు ఇష్టమైన టీ షర్ట్‌ను ముక్కముక్కలుగా చేయమని ఆర్డర్‌ వేసింది. ఇక శివజ్యోతి బెడ్‌ను రవి తడపడంతో.. అతని బెడ్‌ను తడిపే అవకాశం శివజ్యోతికి ఇచ్చింది. ఇలా తాను అన్యాయమని ఫీలైన సంఘటనలను గుర్తు చేసుకుని.. వాటికి ప్రతీకార చర్యలు తీసుకునేలా అందరికీ అవకాశమిచ్చింది. 
(బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు)

శనివారం ఎపిసోడ్‌ఎంటర్‌టైన్‌ మెంట్‌తో ముగిసినా.. ఆదివారం ఏం జరగనుందో చూడాలి. అయితే సోషల్‌ మీడియాలో నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం ఆరోవారంలో ఎలిమినేషన్‌ను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మరి ఆడియెన్స్‌ వేసిన ఓట్లు.. బూడిదలో పోసిన పన్నీరేనా? అని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement