చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయింది – శివలెంక కృష్ణప్రసాద్‌

Big cinema in small cinema has become - Shivalinga Krishnaprasad - Sakshi

‘‘గోపీగణేష్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమాను బాగా తీశాడు. సత్యదేవ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే వీళ్ల దగ్గర నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. వీళ్ల కష్టానికి మనం ఇచ్చే ఎనర్జీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమే’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్‌ మాస్టర్‌’. శ్రీదేవి మూవీస్‌ సంస్థ అధినేత శివలెంక కృష్ణ్ణప్రసాద్‌ సమర్పణలో అభిషేక్‌ ఫిలిమ్స్‌ అధినేత రమేష్‌ పిళ్లై నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ‘బ్లఫ్‌ మాస్టర్‌’. గీతా ఆర్ట్స్, సురేశ్‌ ప్రొడక్షన్స్‌... ఇలా చూసిన ప్రతివాళ్లూ ఎగ్జయిట్‌ అయ్యారు.

అదే ఎగ్జయిట్‌మెంట్‌ జనాల్లో కనిపిస్తోంది. నిర్మాతగా మాకు సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘తమిళ సినిమా ‘చదురంగ వేటై్ట’ విడుదలైన ఆరు నెలల తర్వాత ఆ చిత్రదర్శకుడు హెచ్‌.వినోద్‌ను పోలీసులు కలిసి దో నెంబర్‌ దందా నేరాలు తగ్గాయని అభినందిస్తూ లేఖ ఇచ్చారట. ఇక్కడ కూడా సినిమా అలాంటి ప్రభావం చూపించినప్పుడు మా ప్రయత్నం విజయవంతమైనట్టు’’ అని గోపీగణేష్‌ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో అవని పాత్రలో నటించలేదు.. జీవించాను. ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ప్రేక్షకుల స్పందన గురించి విన్నప్పుడు, చూసినప్పుడు గర్వంగా అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నా’’ అని సత్యదేవ్‌ అన్నారు. పాటల రచయిత లక్ష్మీభూపాల్‌ పాల్గొన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top