breaking news
Bluff Master Movie
-
అనంతపురంలో బ్లఫ్ మాస్టర్ సీన్
-
చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయింది – శివలెంక కృష్ణప్రసాద్
‘‘గోపీగణేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను బాగా తీశాడు. సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే వీళ్ల దగ్గర నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. వీళ్ల కష్టానికి మనం ఇచ్చే ఎనర్జీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ్ణప్రసాద్ సమర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. గీతా ఆర్ట్స్, సురేశ్ ప్రొడక్షన్స్... ఇలా చూసిన ప్రతివాళ్లూ ఎగ్జయిట్ అయ్యారు. అదే ఎగ్జయిట్మెంట్ జనాల్లో కనిపిస్తోంది. నిర్మాతగా మాకు సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘తమిళ సినిమా ‘చదురంగ వేటై్ట’ విడుదలైన ఆరు నెలల తర్వాత ఆ చిత్రదర్శకుడు హెచ్.వినోద్‌ను పోలీసులు కలిసి దో నెంబర్ దందా నేరాలు తగ్గాయని అభినందిస్తూ లేఖ ఇచ్చారట. ఇక్కడ కూడా సినిమా అలాంటి ప్రభావం చూపించినప్పుడు మా ప్రయత్నం విజయవంతమైనట్టు’’ అని గోపీగణేష్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో అవని పాత్రలో నటించలేదు.. జీవించాను. ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ప్రేక్షకుల స్పందన గురించి విన్నప్పుడు, చూసినప్పుడు గర్వంగా అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నా’’ అని సత్యదేవ్ అన్నారు. పాటల రచయిత లక్ష్మీభూపాల్ పాల్గొన్నారు. -
బ్లఫ్ మాస్టర్స్
-
‘బ్లఫ్ మాస్టర్’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్లఫ్ మాస్టర్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : సత్యదేవ్, నందిత శ్వేత, ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ సంగీతం : సునీల్ కాశ్యప్ దర్శకత్వం : గోపి గణేష్ నిర్మాత : శివలెంక కృష్ణ ప్రసాద్, పి. రమేష్ సపోర్టింగ్ రోల్స్‌తో వెండితెరకు పరిచయం అయిన సత్యదేవ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారాడు. తరువాత కూడా క్షణం, ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలతో నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకొని మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన శతురంగవేట్టై సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బ్లఫ్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ హీరోగా సక్సెస్ సాదించాడా..? కథ : ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) ఏడేళ్ల వయస్సులో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక్కడ బతకాలంటే డబ్బు కావాలనే ఉద్దేశంతో.. ఆ డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్ రకరకాల పేర్లతో ఎన్నో మోసాలు చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కొని బయట పడతాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారాడు..? ఉత్తమ్ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు..? ఆమె రాకతో ఉత్తమ్ ఎలా మారాడు..? మంచి వాడిగా మారిన ఉత్తమ్‌కు ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా సత్యదేవ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మాటలతో మాయ చేసి మోసం చేసే పాత్రలో సత్యదేవ్ నటన వావ్ అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో మెప్పించిన సత్య, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లోనూ అంతే బాగా ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో నందితా శ్వేత ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఆమె నటన కాస్త నాటకీయంగా అనిపించినా.. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌తో మంచి మార్కులు సాధించింది. ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : తమిళ సినిమా శతురంగవేట్టైని తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు గోపీ గణేష్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీర్చిదిద్దటంలో సక్సెస్ సాధించాడు. అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. కథనంలో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో డ్యూయెట్లు, ఫైట్లు ఇరికించకుండా సినిమాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపించినా ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెడ్డటంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాకు మరో బలం డైలాగ్స్ చాలా డైలాగ్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా గుర్తుండిపోయేలా ఉన్నాయి. సునీల్ కాశ్యప్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సత్యదేవ్ డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్.