భాయ్‌తో భరత్‌

Bharath signs a Bollywood biggie with Salman Khan - Sakshi

‘ప్రేమిస్తే’ (తమిళంలో ‘కాదల్‌’) సినిమాలో హీరోగా నటించిన భరత్‌ గుర్తున్నారు కదా. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించారు. 2017లో మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్‌’ సినిమాలో విలన్‌ ఎస్‌జే సూర్యకు తమ్ముడి పాత్రలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి ఈ భరత్‌కు పిలుపొచ్చింది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తారు. ఇందులోనే భరత్‌ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. హిందీలో భరత్‌కు ఇదే తొలి సినిమా. ‘‘సల్మాన్‌ భాయ్‌తో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి, అవకాశం కల్పించిన ప్రభుదేవాగారికి థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు భరత్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top