ఎవరినీ నొప్పించాలనుకోను

bharath ane nenu movie pressmeet - Sakshi

‘‘నేను ఏ సినిమా తీసినా ఎవర్నీ హర్ట్‌ చేయకూడదనుకుంటాను. నా కాన్సంట్రేషన్‌ అంతా ఆడియన్స్‌ పైనే. పర్సనల్‌గా సెటైర్‌ వేసి సినిమాకు మైలేజ్‌ పొందుదామనుకునే చీప్‌ ఫిల్మ్‌ మేకర్‌ని కాను నేను. ప్రజలను మోటివేట్‌ చేయాలనుకున్నాను. అందుకే ఇష్యూస్‌ను అడ్రస్‌ చేశాను. పీపుల్స్‌కు నా సినిమా రీచ్‌ అవ్వాలి, నిర్మాతకు డబ్బులు రావాలి, ఎప్రిషియేషన్‌ కూడా రావాలి అనే ఫ్యాక్టర్స్‌ని కూడా ఆలోచిస్తా’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ.

మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ‘భరత్‌ అనే నేను’.  ఈ సినిమా సక్సెస్‌ను చిత్రబృందం ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొరటాల శివ మాట్లాడుతూ –‘‘సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇంత ఎప్రిషియేషన్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. కేటీఆర్‌గారు, జయప్రకాశ్‌ నారాయణ లాంటి వారు సినిమా బాగుందని చెప్పడం హ్యాపీ.

ఎవరైనా కొత్త ఆలోచనలతో వస్తే నేను ప్రొడ్యూస్‌ చేస్తా. ఆ ఆలోచన ఉంది. ‘శ్రీమంతుడు’ అంటే గ్రామాల దత్తత మాత్రమే. అదే సీయం క్యారెక్టర్‌ మోర్‌ పవర్‌ఫుల్‌ అయితే మరిన్ని ఇష్యూస్‌ అడ్రెస్‌ చేయవచ్చని ఈ కథను తీసుకున్నాం. ప్రతి సినిమాలో కొత్త చాలెంజ్‌ను కోరుకునే నటుడు మహేశ్‌బాబు. ఆలా ప్రయోగాలు చేసే హీరో కెరీర్‌లో ఓన్లీ హిట్స్‌ మాత్రమే ఉండకపోవచ్చు. నేను రెండు సార్లు మహేశ్‌గారికి లైఫ్‌ ఇచ్చానని ఆయన చెప్పారు.

అది మహేశ్‌గారి గొప్పదనం. బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. ‘మిర్చి’ సినిమాను రీమేక్‌ చేయమని చాలామంది అడిగారు. టాలీవుడ్‌లో నాకు కంఫర్ట్‌ అనిపించింది. రామ్‌చరణ్‌గారితో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌గారితో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే నెక్ట్స్‌ సినిమా ఏంటి? అనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. హాలిడేకి వెళ్లాలనుకుంటున్నా. వచ్చిన తర్వాత పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నా’’ అన్నారు.

‘భరత్‌ అనే నేను’ గురించి ఇంకా చెబుతూ – ‘‘మొదట్లో టు పార్ట్స్‌ చేస్తే బాగుండు అనుకున్నాం. అంత కంటెంట్‌ కూడా ఉంది.చెప్పాల్సిన ఇష్యూస్‌ ఇంకా ఉన్నాయి. అందుకే అలా అనిపించింది. ఏమో ఎప్పటికైనా చెస్తామేమో! మహేశ్‌ క్యారెక్టర్‌ కోసం ఓన్లీ పొలిటీషియన్స్‌నే రిఫరెన్స్‌గా తీసుకోలేదు. లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ను తీసుకొన్నాను. ఆ లీడర్‌ ఒక సోషల్‌ వర్కర్‌ అయ్యి ఉండచ్చు. ఇన్‌స్ట్యూషన్‌ హెడ్‌ అయ్యి కూడా ఉండచ్చు.

ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్‌ చాన్స్‌ వారసులకే ఇస్తుంది. సినిమాలో భరత్‌ రామ్‌ క్యారెక్టర్‌ అలానే సీయం అయ్యాడు’’ అన్నారు. ఇటీవల పోసానిగారు మీ కథలను కొందరు తీసుకున్నారు అన్నారు. దీని గురించి ఏమంటారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ– ‘‘ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. పాత ఇష్యూస్‌ అవి. ఒక జాబ్‌లోకి వెళ్లినప్పుడు పాజిటివ్స్‌ అండ్‌ నెగటివ్స్‌ ఉంటాయి. ఇది ఇండస్ట్రీలో ఉంది. వాటిని ఓవర్‌కమ్‌ చేసుకుని ముందుకు వెళ్లాలి’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top