ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా | Bhandarkars next against backdrop of 1975 emergency | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా

Sep 28 2016 12:51 PM | Updated on Sep 4 2017 3:24 PM

ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా

ఎమర్జెన్సీ రోజులపై మధుర్ సినిమా

బాలీవుడ్లో రియలిస్టిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మధుర్ బండార్కర్ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్, క్యాలెండర్ గర్ల్స్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో ఎన్నో చీకటి కోణాల్ని వెండితెర...

బాలీవుడ్లో రియలిస్టిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మధుర్ బండార్కర్ మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్,  క్యాలెండర్ గర్ల్స్, ఫ్యాషన్ లాంటి సినిమాలతో ఎన్నో చీకటి కోణాల్ని వెండితెర మీద ఆవిష్కరించిన మధుర్, భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పబడిన ఎమర్జెన్సీ రోజుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని మధుర్ స్వయంగా ప్రకటించాడు.

గత కొద్ది రోజులుగా మధుర్ బండార్కర్ దర్శకత్వంలో బాలీవుడ్ వైఫ్స్ లేదా ఎయిర్ హోస్టస్ అనే చిత్రాలు తెరకెక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను అలాంటి చిత్రాలను చేయటం లేదని.. ప్రస్తుతం 1975లో 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో కథ రెడీ చేసే పనిలో ఉన్నానని ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement