స్నేహమెంత మధురం..! | Best Friends Forever trailer released | Sakshi
Sakshi News home page

స్నేహమెంత మధురం..!

Mar 3 2015 11:18 PM | Updated on Sep 2 2017 10:14 PM

స్నేహమెంత మధురం..!

స్నేహమెంత మధురం..!

మెట్రో లైఫ్ నేపథ్యంలో ఫ్రెండ్‌షిప్ ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరె వర్’. ‘చంద్రహాస్’, ‘హోప్’ చిత్రాలను నిర్మించిన

 మెట్రో లైఫ్ నేపథ్యంలో ఫ్రెండ్‌షిప్ ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరె వర్’. ‘చంద్రహాస్’, ‘హోప్’ చిత్రాలను నిర్మించిన హరనాథ్ పొలిచర్ల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. హరనాథ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం స్నేహం విలువను చాటిచెప్పే సినిమా’’ అని తెలిపారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోవాలని దర్శకుడు సూర్యకిరణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రచయిత శివశక్తి దత్తా, హీరోయిన్లు సురభి, ఏంజెలీనా, నటుడు విశ్వరామ్, ఛాయగ్రాహకుడు సి.హెచ్ గోపీనాథ్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement