బాలరాజు త్వరలో వస్తాడు | Bangari Balaraju Movie Theatrical Trailer | Sakshi
Sakshi News home page

బాలరాజు త్వరలో వస్తాడు

Jun 19 2018 1:31 AM | Updated on Jun 19 2018 1:31 AM

Bangari Balaraju Movie Theatrical Trailer - Sakshi

కరోణ్య కత్రిన్‌, రాఘవ్

‘‘బంగారి బాలరాజు’ పాటలన్నీ చాలా బాగున్నాయి. చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు కొత్తవారైనా చక్కని సంగీతం అందించారు ’’ అని నిర్మాత, ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్‌ జంటగా  కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా ట్రైలర్‌ని అంబికా కృష్ణ రిలీజ్‌ చేయగా, ఆడియో సీడీలను సురక్ష కంపెనీస్‌ గ్రూప్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ పద్మజ మానేపల్లి విడుదల చేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల సబ్సిడీతో పాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. అయితే.. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాలి’’ అన్నారు.   కోటేంద్ర దుద్యాల, కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
∙కరోణ్య, రాఘవ్‌

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement