‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల | bahubali2 tamil audio released in chennai | Sakshi
Sakshi News home page

‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల

Apr 10 2017 2:10 AM | Updated on Sep 5 2017 8:22 AM

‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల

‘బాహుబలి–2’ తమిళ ఆడియో విడుదల

దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి–2‘ చిత్రానికి సంబంధించి తమిళ ఆడియో ఆదివారం చెన్నైలో విడుదలైంది

తమిళసినిమా(చెన్నై):
దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి–2‘ చిత్రానికి సంబంధించి తమిళ ఆడియో ఆదివారం చెన్నైలో విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదల కాబోతుంది.

చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కోలీవుడ్‌ ప్రముఖులు కలైపులి థాను, కేఆర్, నటుడు ధనుష్, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా, ఆర్‌కే సురేష్, నటుడు రాంకీ, నిరోషా దంపతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement