అందుకు ప్రతిరూపమే ఈ చిత్రం: బగ్గిడి గోపాల్‌

Baggidi Gopal Movie Audio Launch  - Sakshi

మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ జీవితం ఆధారంగా అర్జున్‌ కుమార్‌ దర్శకత్వంలో బగ్గిడి ఆర్ట్స్‌ మూవీస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘బగ్గిడి గోపాల్‌’. టైటిల్‌ రోల్‌లో బగ్గిడి గోపాల్‌ నటించారు. సుమన్, కవిత, గీతాంజలి తదితరులు నటించిన ఈ సినిమాకు జయసూర్య స్వరకర్త. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో సీడీని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె. రోశయ్య రిలీజ్‌ చేశారు.

బగ్గిడి గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరూ చదవరు. కాబట్టి సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ల మనోవేదనకు ప్రతి రూపమే ఈ ‘బగ్గిడి గోపాల్‌’. త్వరలో రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి జమున, ఏపీసీసీ ప్రెసిడెంట్‌ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top