బ్యాక్ లెస్... బ్యూటీ మోర్! | Back to Les ... Beauty More! | Sakshi
Sakshi News home page

బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!

Feb 3 2016 10:10 PM | Updated on Jul 23 2019 11:50 AM

బ్యాక్ లెస్... బ్యూటీ మోర్! - Sakshi

బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!

‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు.

 ‘‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు. ‘ఫలానా సినిమాలో గ్లామర్ పరంగా కొంచెం హద్దు దాటినట్లున్నారు?’ అనే ప్రశ్నకు కథానాయికలు సర్వసాధారణంగా చెప్పే జవాబు అది. ఒకప్పుడు నిండైన చీరకట్టులో కనిపించిన తారలు.. అప్పుడప్పుడు మాత్రం కురచ గౌనుల్లోనూ, ఉల్లిపొర లాంటి చీరల్లోనూ కనువిందు చేసేవారు. ఇప్పుడు మామూలుగానే ట్రెండ్ మారింది.

దాంతో, బట్టల నిడివి తగ్గడం సాధారణమైంది. నడుము, నాభి చూపించడం సర్వసాధారణమైంది. నిన్న మొన్నటివరకూ ముందు వైపు http://img.sakshi.net/images/cms/2016-02/81454537491_Unknown.jpgఅందాలనే ప్రదర్శించిన తారలు ఇప్పుడు బ్యాక్ పై దృష్టి పెడుతున్నారు. పాటల్లో కొన్ని సెకన్ల పాటు వీపు భాగం చూపిస్తున్న తారలు విడిగా అవార్డుల ఫంక్షన్లలో ఇంకా రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ స్టయిల్‌లో పొడవాటి గౌనుల్లో దర్శనమిస్తున్నారు. వీపు అంతా కనిపించేలా వెనక భాగంలో దాదాపు నడుము నుంచి మాత్రమే బట్టలు ఉండేలా ఆ గౌన్‌లను డిజైన్ చేయించుకుంటున్నారు.

అలా ఈ మధ్యకాలంలో వీపు అందాలను చూపించి, వార్తల్లో నిలిచినవాళ్లల్లో తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, రాశీ ఖన్నా తదితరులు ఉన్నారు. వీళ్ల బ్యాక్ బ్యూటీ చూడకుండా, వెనకెనకే ఫాలో కాకుండా ఉండడం కుర్రకారుకు కష్టమే. ఆ సంగతి అలా ఉంచితే... ఇలా పొదుపైన బట్టలు వాడుతున్న తారలు పిసినారులని మాత్రం అనుకోకండి. ఒక్కో గౌను ఖరీదు మినిమమ్ 50 వేల రూపాయల నుంచి మొదలవుతుంది. కొన్నిటి ధర అయితే, లక్ష పైగానే ఉంటుందట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement