బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ | baahubali 21500Cr movie in Indian Cinema | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ

May 19 2017 2:08 PM | Updated on Jul 14 2019 4:05 PM

బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ - Sakshi

బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ

బాహుబలి 2 మరో అరుదైన ఘనతను సాధించింది. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన

బాహుబలి 2 మరో అరుదైన ఘనతను సాధించింది. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా తరువాత మరో పదిరోజుల్లో 1500 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిన బాహుబలి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో బాహుబలి కలెక్షన్ల జోరు బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది.

ఈ శుక్రవారంతో 1500 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఫుల్ రన్ లో మరిన్ని సంచలనాలు నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. త్వరలో సింగపూర్ లో రిలీజ్ అవుతున్న బాహుబలి 2ను ఈ ఏడాది చివర్లో చైనా, జపాన్ దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇదే రెస్పాన్స్ వస్తే 2000 కోట్ల కలెక్షన్లు కూడా సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement