యూట్యూబ్ వ్యూస్ లో బాహుబలి 2 రికార్డ్ | Baahubali 2 youtube record | Sakshi
Sakshi News home page

Dec 9 2017 10:56 AM | Updated on Jul 14 2019 4:05 PM

Baahubali 2 youtube record - Sakshi

భారతీయ సినిమా చరిత్రలోని అన్ని రికార్డ్ లను తిరగరాసిన తెలుగు సినిమా బాహుబలి 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాహుబలి 2 సంచలన విజయం సాధించటమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2, 2017 యూట్యూబ్ లోనూ రికార్డ్ సృష్టించింది.

2017లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ట్రైలర్ల జాబితాలో బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో నిలిచింది. 9 కోట్ల 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి హాలీవుడ్ సినిమా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ తొలి స్థానంలో నిలవగా 8 కోట్లకుపైగా వ్యూస్ తో బాహుబలి 2 ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఇన్ క్రెడిబుల్స్ 2, థోర్ : రాగ్నరాక్ బాహుబలి 2 తరువాతి స్థానాల్లో నిలవగా బాలీవుడ్ సినిమాలు టైగర్ జిందాహై, పద్మావతి చిత్రాల ట్రైలర్లు 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement