అఫీషియల్ : మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ | Baahubali 2 trailer on 16th March 2017 | Sakshi
Sakshi News home page

అఫీషియల్ : మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్

Mar 11 2017 2:18 PM | Updated on Jul 14 2019 4:05 PM

అఫీషియల్ : మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ - Sakshi

అఫీషియల్ : మార్చి 16న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ విజువల్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ విజువల్ వండర్ బాహుబలి 2. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన బాహుబలి 2తో మరోసారి బాక్సాఫీస్ మీదకు దండెత్తుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మధ్యే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన బాహుబలి టీం ట్రైలర్ లాంచ్తో సినిమా మీద అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

తొలి భాగం కన్నా భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 16న సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్లో ఉదయం 9 గంటలకు బాహుబలి 2 ట్రైలర్ను ప్రదర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి 2 ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement