రివ్యూలను పట్టించుకోవద్దు

Avoid Movie Reviews Said Varalaxmi SarathKumar - Sakshi

సినిమా: సినిమా రివ్యూలను పట్టించుకోవద్దు అని అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. కథానా యకి పాత్ర, ప్రతినాయకి పాత్ర? ప్రధాన పాత్ర అన్న విషయాలను అసలు పట్టించుకోకుండా, నటనకు అవకాశం ఉంటే, పాత్ర తనకు నచ్చితే నటించడానికి రెడీ అనే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. వివిధ రకాల పాత్రలతో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న సంచలన నటి ఈ బ్యూటీ. నటుడు విశాల్‌లో ప్రేమ, కాదు మనస్పర్థలు, విడిపోయారు లాంటి ఒకదానికొకటి పొంతన లేని ప్రచారాలతో వార్తల్లో నానే వరలక్ష్మీశరత్‌కుమార్‌ తాజాగా విశాల్‌ హీరోగా నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న సండైకోళి–2 చిత్రంలో ప్రతినాయకిగా నటిస్తూ ఆమె గురించి ఉన్నది లేనిది రాసేవారిని మరోసారి అయోమయంలో పడేసింది. కాగా ఇటీవల ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన హెచ్చరికై చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఆదివారం ఆమె ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో హెచ్చరికై చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా నిజాయితీగా విమర్శలు రాసిన కొందరు పాత్రికేయులకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో పెయిడ్‌ రివ్యూలు అధికం అవుతున్నాయి. అఫ్‌ కోర్స్‌ కొందరు తారలు అందుకు కారణం అవుతున్నారనుకోండి. అలాంటి రివ్యూలు రాసే వారు కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది.

అయితే ఇలాంటి విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే నేనింకా ఇండస్ట్రీ గురించి నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇక్కడ చిన్న డిస్ట్రిబ్యూటర్స్, పెద్దవారు అంటూ రాజకీయాలు జరుగుతున్నాయి. దీని వల్ల నష్టపోతున్నది ప్రేక్షకులే. కారణం ఇక్కడ జరిగే గేమ్‌ వల్ల  మంచి కథా వస్తువు కలిగిన హెచ్చరికై లాంటి చిన్న చిత్రాలను మిస్‌ అవుతున్నారు. అందుకే రివ్యూలను చూసి చిత్రాల గురించి ఒక అభిప్రాయానికి రాకండి. నిజానికి ఇప్పుడు మంచి చిత్రాలు చాలా వస్తున్నాయి. అలాంటి చిత్రాలను రక్షించేది మీరే. స్టార్స్‌ ట్రాక్‌లో పడకండి. చిన్న చిత్రాలను ఆదరించండి. అలాంటి చిత్రాల వల్లే చిత్రపరిశ్రమకు మనుగడ. దాని భవిష్యత్‌ అనేది మీ చేతుల్లోనే ఉంది. టికెట్‌ కొని సినిమాలు చూడండి, ఆనందించండి. మరోసారి నిజాయితీగా రివ్యూలు రాసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా చిన్న చిత్రాల మనుగడ అనేది ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది. అదే విధంగా నేను మంచి కథా పాత్రలను ఎంచుకుని నటించడానికి కారణమైన, ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ప్రామిస్‌ చేస్తున్నాను. రివ్యూలు ఎలా ఉన్నా, నేను ఎంచుకున్న పాత్రలకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమించి మిమ్మల్ని సర్‌ప్రజ్‌ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తాను అని పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top