పోలీసాఫీసర్‌గా... | As a police officer... | Sakshi
Sakshi News home page

పోలీసాఫీసర్‌గా...

May 15 2014 10:41 PM | Updated on Sep 2 2017 7:23 AM

పోలీసాఫీసర్‌గా...

పోలీసాఫీసర్‌గా...

తమిళంలో మంచి మాస్ హీరో అయిన అజిత్‌కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అజిత్ ‘నే వస్తున్నా’ అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

తమిళంలో మంచి మాస్ హీరో అయిన అజిత్‌కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అజిత్ ‘నే వస్తున్నా’ అనే అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో మీరాజాస్మిన్ కథానాయిక. ఎస్. మురళీ రామనాథన్ నిర్మాత. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అజిత్ శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో ఉన్న పదకొండు ఫైట్స్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తాయి. మణిశర్మ స్వరపరచిన ఆరు పాటలూ వినసొంపుగా ఉంటాయి. అజిత్ యాక్షన్, మీరాజాస్మిన్ అభినయం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ .వై, సహనిర్మాత: పరిటాల రాంబాబు, దర్శకత్వం: ఎన్. మహరాజన్.
 

Advertisement
 
Advertisement
Advertisement