సూపర్‌ హీరోలకు స్పెషల్‌ సాంగ్‌

AR Rahman to compose song for Avengers Endgame - Sakshi

దేశీ సూపర్‌ స్టార్స్‌కి ఎన్నో మంచి పాటలిచ్చారు ఏఆర్‌ రెహమాన్‌. విదేశీ తారలకూ మంచి పాటలిస్తుంటారు. మరి అద్భుతమైన విన్యాసాలు చేసే సూపర్‌ హీరో క్యారెక్టర్స్‌కే సంగీతం ఇవ్వాలంటే? అది ఏ లెవల్‌లో ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇండియాలో హాలీవుడ్‌ సూ టపర్‌ హీరోల సినిమాలకు మంచి మార్కెట్‌ ఉంది. ‘అవెంజర్స్‌’కు అయితే బోలెడు క్రేజు. ఈ సిరీస్‌లో లేటెస్ట్‌గా వస్తున్న సినిమా ‘అవెంజర్స్‌ – ఎండ్‌ గేమ్‌’. ఇందులో ఓ స్పెషల్‌ సాంగ్‌ను రెహమాన్‌తో కంపోజ్‌ చేయించారు చిత్రబృందం. హిందీ, తెలుగు, తమిళ వెర్షన్‌లలో ఈ సాంగ్‌ను పొందుపరచనున్నారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ను ఏప్రిల్‌ 7 లేదా 8న హైదరాబాద్‌లో రెహమానే స్వయంగా రిలీజ్‌ చేయనున్నారు. వాల్ట్‌ డిస్నీ కంపెనీ స్టూడియో హెడ్‌ బిక్రమ్‌ దుగ్గల్‌ కూడా పాల్గొననున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top