తెరపైకి కలాం జీవితం

apj abdul kalam biopic in anil kapoor - Sakshi

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం బయోపిక్‌ వెండితెరకు రానుందని టాక్‌. బాలీవుడ్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్, టాలీవుడ్‌ నిర్మాత అనిల్‌ సుంకర కలిసి ఈ ప్రాజెక్టును పలు భాషల్లో (తెలుగులోనూ) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో కలాం పాత్రలో హీరో అనిల్‌ కపూర్‌ నటించనున్నారని భోగట్టా. 1931 అక్టోబర్‌ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2015 జులై 27న మృతి చెందారు. 2002 నుంచి 2007 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నారు. కలాం జీవితంపై రచయిత రాజ్‌ చెంగప్ప రాసిన ‘వెపన్స్‌ ఆఫ్‌ పీస్‌’ బుక్‌ ఆధారంగా కథ రెడీ చేశారట. కాగా, 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘వంశవృక్షం’ అనే తెలుగు చిత్రంలో నటించారు అనిల్‌. దాదాపు 38ఏళ్ల తర్వాత మరోసారి ఆయన నటించే తెలుగు సినిమా కలాం బయోపిక్‌ అవుతుంది. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారు కాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top