అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు | AP CM YS Jagan Greets National Film Award Winners | Sakshi
Sakshi News home page

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

Aug 9 2019 8:19 PM | Updated on Aug 9 2019 9:13 PM

AP CM YS Jagan Greets National Film Award Winners - Sakshi

సాక్షి, అమరావతి :  66​వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’,  ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్త‌మ చిత్రంగా మ‌హాన‌టి ఎంపికైంది. ఉత్త‌మ న‌టిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ మ‌హాన‌టి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు.

(చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement