రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్! | Anushka's Rudrama Devi first look released | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్!

Nov 6 2013 5:31 PM | Updated on Sep 2 2017 12:20 AM

రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్!

రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్!

ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు.

ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం రుద్రమదేవి.  గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిస్తారికల్ స్టీచరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినీ చరిత్రలో కొత్త టెక్నాలజీతో రూపొందుతున్న తొలిచిత్రం.

అనుష్క పుట్టినరోజుని రోజు పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..గత ఏడాది అనుష్క పుట్టిన రోజున ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాం. అనుష్క నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. వచ్చే మార్చికి షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు.

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను నిత్యామీనన్, మరో పాత్రను కేథరిన్ చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, సమన్, జయప్రకాష్‌రెడ్డి, ప్రభ తదితరులు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement