జవాబు ఎక్కడ? | Anushka Sharma Missed Amitabh Bachchan's Birthday SMS. So He Tweeted This | Sakshi
Sakshi News home page

జవాబు ఎక్కడ?

May 3 2018 5:08 AM | Updated on Aug 25 2018 6:37 PM

Anushka Sharma Missed Amitabh Bachchan's Birthday SMS. So He Tweeted This - Sakshi

సెలబ్రిటీల బర్త్‌ డేలకు కొన్ని వందల విషెస్‌ అందుతుంటాయి. అన్ని శుభాకాంక్షలకు సమాధానం చెప్పాలంటే కొంచెం కష్టమే. మే 1న అనుష్కా శర్మ బర్త్‌ డే. అనుష్క ఫోన్‌ ఆమె ఫ్యాన్స్‌ విషెశ్‌తో నిండిపోయినట్టుంది. అవన్నీ చూసుకునే తీరిక ఆమెకు ఉండి ఉండకపోవచ్చు. అందుకేనేమో అమితాబ్‌ విషెశ్‌కు రిప్లయ్‌ ఇవ్వలేకపోయి ఉంటారు.

అమితాబ్‌ బచ్చన్‌ ఊరుకుంటారా? ట్వీటర్‌లో తమాషాగా ‘‘అనుష్కా.. నేను అమితాబ్‌ బచ్చన్‌ను. నీ బర్త్‌డేకు ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా  శుభాకాంక్షలు పంపాను. రెస్పాన్స్‌ రాలేదు. విషయం కనుక్కుంటే నువ్వు నంబర్‌ మార్చేశావన్నారు. మళ్లీ విషెస్‌ చెబుతున్నాను. హ్యాపీ బర్త్‌ డే. మంగళవారం జరిగిన ఐపీయల్‌ మ్యాచ్‌లో చాలా అందంగా కనిపించావు’’ అని ట్వీట్‌ చేశారు అమితాబ్‌. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ సార్‌. ఈ ట్వీట్‌ పంపుతూనే మీ ఎస్‌ఎమ్‌ఎస్‌కు కూడా రిప్లయ్‌ ఇస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనుష్కా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement