అది నా ఫేస్ బుక్ అకౌంట్ కాదు! | Anurag Basu warns against fake Facebook account | Sakshi
Sakshi News home page

అది నా ఫేస్ బుక్ అకౌంట్ కాదు!

Aug 11 2014 2:23 PM | Updated on Apr 3 2019 6:23 PM

అది నా ఫేస్ బుక్ అకౌంట్ కాదు! - Sakshi

అది నా ఫేస్ బుక్ అకౌంట్ కాదు!

బాలీవుడ్‌ ప్రముఖ రచయిత, దర్శకుడు అనురాగ్‌ బసు తనపై ఫేస్ బుక్ లో వచ్చిన వార్తలను ఖండించాడు.

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ రచయిత, దర్శకుడు అనురాగ్‌ బసు తనపై ఫేస్ బుక్ లో వచ్చిన వార్తలను ఖండించాడు. అనురాగ్ ఫేస్ బుక్ అకౌంట్ లో రణబీర్‌ కపూర్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఈ మధ్య గుప్పుమన్నాయి. అయితే ఇందులో నిజం లేదని బసు ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఆ ఫేస్‌ బుక్‌ ఎకౌంట్‌ నాది కాదు. నా పేరుతో ఉన్న ఫేక్‌ ఎకౌంట్‌. రణబీర్‌తో మరో సినిమాకు ఎలాంటి సంతకం చేయలేదు. మా మధ్య అలాంటి చర్చే జరగలేదని స్పష్టం చేశాడు.

'బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ బసు మరోసారి రణబీర్‌ కపూర్‌ తో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది'  అని అనురాగ్‌ బసు పేరుతో ఉన్న ఫేస్‌ ఎకౌంట్‌ ద్వారా వార్త వెలువడింది. దీంతో అందరూ నిజమే అనుకున్నారు. ఈ ఉదంతం కూడా బాలీవుడ్‌ లో చర్చకు దారి తీసింది. ఈ విషయంపై బసు వెంటనే స్పందించాడు. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్‌లో రణబీర్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జబ్బా జసూస్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాలో రణబీర్‌ సరసన కత్రినా కైఫ్‌ నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement