ఎంతో దూరంలో లేదు | antariksham trailer released on dec 9 | Sakshi
Sakshi News home page

ఎంతో దూరంలో లేదు

Dec 6 2018 12:51 AM | Updated on Dec 6 2018 11:05 AM

antariksham trailer released on dec 9 - Sakshi

అంతరిక్షాన్ని చేరుకోవడానికి తాను చేసిన ప్రయత్నాన్ని విజువల్‌గా చూపించడానికి రెడీ అయ్యారు హీరో వరుణ్‌ తేజ్‌. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్, అదితీరావు హైదరీ, లావణ్యాత్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో వరుణ్‌తేజ్, అదితీ ఆస్ట్రోనాట్స్‌గా కనిపించనున్నారు. ఈ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక ఏఎమ్‌బి మల్టీఫ్లెక్స్‌లో జరిపేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్, టీజర్‌లకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ప్రశాంత్‌ విహారి సంగీతం అందించారు. రాధాకృష్ణ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల ఎంతో దూరంలో లేదు... ఈ నెల 21న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement