మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం | Another new technology is introduced | Sakshi
Sakshi News home page

మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం

Nov 16 2014 10:57 PM | Updated on Sep 2 2017 4:35 PM

మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం

మరో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాం

‘‘టెక్నాలజీని వినియోగించి, తక్కువ ఖర్చుతో సినిమా తీయడం రామ్‌గోపాల్‌వర్మ శైలి.

‘‘టెక్నాలజీని వినియోగించి, తక్కువ ఖర్చుతో సినిమా తీయడం రామ్‌గోపాల్‌వర్మ శైలి. ‘ఐస్‌క్రీమ్’ చిత్రం ద్వారా ఫ్లోకామ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇప్పుడు ‘ఐస్‌క్రీమ్-2’ ద్వారా మరో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దాని గురించి త్వరలో చెబుతాం’’ అని చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. జేడీ చక్రవర్తి, నందు, భూపాల్, నవీనా, గాయత్రి నటించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడారు ‘‘18 రోజుల్లో ఈ చిత్రాన్ని తీశాం. కానీ, వర్మగారికి సంతృప్తి అనిపించకపోవడంతో రీషూట్ చేశాం. దానివల్ల ఖర్చు పెరిగినప్పటికీ, మేం పెట్టిన పెట్టుబడి వస్తుందనే నమ్మకం ఉంది’’ ఆయన అన్నారు. పెద్ద చిత్రాలను తప్ప ఇతర చిత్రాలు ఎవరూ కొనడం లేదనీ, అందుకే యూత్‌ఫుల్ చిత్రాలైతే సేఫ్ అని ఇలాంటివి చేస్తున్నాననీ తుమ్మలపల్లి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement