ఘనంగా.. అన్న అవార్డులు | Anna Awards presentation | Sakshi
Sakshi News home page

ఘనంగా.. అన్న అవార్డులు

Jul 16 2017 10:21 AM | Updated on Sep 5 2017 4:10 PM

వారిద్దరూ వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులు. చంద్రునికో నూలుపోగన్నట్లు మరో అవార్డు ఖాతాలో జమైంది. 2017 సంవత్సరానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని

బెంగళూరు : వారిద్దరూ వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులు. చంద్రునికో నూలుపోగన్నట్లు మరో అవార్డు ఖాతాలో జమైంది. 2017 సంవత్సరానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ సినీ గాయకుడు  ఎస్పీ బాలసుబ్రమణ్యం, నటి, ఎమ్మెల్సీ జయమాలకు శనివారం సాయంత్రం బెంగళూరు టౌన్హాల్లో  కర్ణాటక తెలుగు అకాడెమి అందజేసింది. అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.రాధకృష్ణరాజు, అధ్యక్షుడు ఆర్‌.వి.హరిష్‌ తదితరులు వారికి పురస్కారాలను బహూకరించారు. అకాడమి నేతలు ఆర్‌.ఉమాపతి నాయుడు, సి.వి.శ్రీనివాసయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement