జూలీ.. గీతాంజలి | Anjali and Raai Laxmi to star in RK Studios Banner's Next film | Sakshi
Sakshi News home page

జూలీ.. గీతాంజలి

Dec 16 2017 12:07 AM | Updated on Dec 16 2017 12:07 AM

Anjali and Raai Laxmi to star in RK Studios Banner's Next film - Sakshi

... ఏం చేయబోతున్నారు అంటే ప్రజెంట్‌ సస్పెన్స్‌. తర్వాత చెప్తాం అంటున్నారు చిత్రబృందం. ‘గీతాంజలి, చిత్రాంగద’ వంటి థ్రిల్లర్స్‌లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశారు అంజలి. ‘జూలీ 2’ సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా ఎంట్రీ ఇచ్చారు సౌత్‌ బ్యూటీ రాయ్‌లక్ష్మీ. ఇప్పుడు ఈ గీతాంజలి, జూలీ ఓ సినిమాలో నటించబోతున్నారు. అంజలి, రాయ్‌లక్ష్మీ ముఖ్య తారలుగా కర్రి బాలాజీ దర్శకత్వంలో ఆర్కే స్టూడియోస్‌ బ్యానర్‌పై తమిళ, తెలుగు భాషల్లో ఎమ్‌. రాజ్‌కుమార్‌ నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుంది.

‘‘అంజలి, రాయ్‌ లక్ష్మీ పాత్రల గురించి తర్వాత చెబుతాం. కచ్చితంగా ఇప్పటివరకూ చేయని పాత్రల్లో కనిపిస్తారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. డిఫరెంట్‌ స్టోరీకి సోషల్‌ అంశాలను జోడించి ఉత్కంఠభరితంగా తెరకెక్కించనున్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. సాయికుమార్, నరేశ్, శివప్రసాద్, ధన్‌రాజ్, జాకీ, అశోక్‌కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దత్తి సురేష్‌ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement